మహీంద్రా కొత్త జనరేషన్ కార్లు తెగ అమ్ముడుపోతున్నాయి. ఏప్రిల్‌లో విడుదల చేసిన మహీంద్రా XUV 3XO, XUV300 వెహికిల్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ మోడల్ కార్లు నెలకు సగటున 9,000 నుంచి10,000 యూనిట్లు అమ్ముడుపోతున్నాయి. అంతకు మందు మహీంద్రా కార్లు దాదాపు 4వేల యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయేవి. XUV 3XO, XUV300 కార్లు కొనాలనుకునే వారు ముందుగా ఆర్డర్ బుక్ చేసుకుంటే వెయింటింగ్ పీరియడ్ వేచి ఉండాల్సి వస్తుంది. మహీంద్రా XUV 3XO మోడల్స్ లో వేరియంట్ల ధరలు రూ. 7.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య ఉన్నాయి.
ALSO READ : పసిడి ప్రియులకు షాక్: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ కారు కొనాలంటే గరిష్టంగా ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. డీజిల్ వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక నెల వేచి ఉండాలి. బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఆరు నెలల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ని ఉంది. ఎందుకంటే మహీంద్రా ఈ వేరియంట్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. హై-స్పెక్ AX5 L, AX7 మరియు AX7 L పెట్రోల్ వేరియంట్‌లు ఇప్పుడు బుక్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల్లో డెలివరీ ఇస్తున్నారు. మిడ్-స్పెక్ AX5 ట్రిమ్ కూడా నాలుగు నెలల పాటు వెయింటింగ్ పీరియడ్ ఉంది.