పదేళ్ల ప్రగతిని గడపగడపకు తెలపాలి: మహిపాల్​ రెడ్డి

 పదేళ్ల ప్రగతిని గడపగడపకు తెలపాలి: మహిపాల్​ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్​100 సీట్లు గెలుస్తుందని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారంపట్టణంలోని జీఎంఆర్​కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడపగడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని  కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.