ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యం: మహమూద్ అలీ

ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యం:  మహమూద్ అలీ

ఆమనగల్లు, వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణే రాష్ట్ర పోలీసుల లక్ష్యమని హోం మంత్రి మహమూద్  అలీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలకేంద్రంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్  భవనాన్ని శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రక్షణ, విధి నిర్వహణలో రాష్ట్ర పోలీసులు ఆదర్శంగా నిలిచారన్నారు. పోలీస్  శాఖకు భారీగా బడ్జెట్  కేటాయించి, ప్రక్షాళన చేయడంతో ప్రజల్లో పోలీస్  శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. మెరుగైన పోలీసింగ్  వ్యవస్థతో ఐటీ, సైబర్ నేరాలు అరికడుతున్నట్లు చెప్పారు. 

డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూశాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్  ఎంపీ రాములు, జడ్పీటీసీ దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, భవన నిర్మాణ దాత శేషగిరిరావు, సైబరాబాద్ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్  డీసీపీ నారాయణరెడ్డి, ఏడీసీపీ రాజ్ కుమార్, షాద్​నగర్  డీసీపీ రంగస్వామి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు హరిశంకర్ గౌడ్, శివప్రసాద్  పాల్గొన్నారు.