బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా 17 ఏళ్ళ టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న సిరీస్ తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్ తో సిరీస్ తర్వాత తాను టీ20 ల నుంచి రిటైర్ అవుతున్నట్లు రెండో టీ20 ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.వన్డే ఫార్మాట్ పై దృష్టి పెట్టడానికి టీ20 ల నుంచి తప్పుకుంటున్నట్టు ఈ సీనియర్ ప్లేయర్ తెలిపాడు.
38 ఏళ్ల ఈ బంగ్లా సీనియర్ బ్యాటర్ 2007 లోనే టీ20 అరంగేట్రం చేశాడు. తన 17 ఏళ్ళ కెరీర్ లో బంగ్లాదేశ్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మధ్యలో బంగ్లాదేశ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్ లో 139 టీ20 మ్యాచ్ ల్లో 2398 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ 40 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన 2024 టీ20 వరల్డ్ కప్ లో మహ్మద్డుల్లా అద్భుతంగా రాణించాడు.
ALSO READ | ENG vs PAK 1st Test: ఇది ఊహించని ట్విస్ట్: స్పైడర్ మ్యాన్ తరహాలో పాక్ క్రికెటర్ క్యాచ్
టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గ్వాలియర్ లో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మహ్మద్డుల్లా ఒక పరుగు మాత్రమే చేశాడు. రెండో టీ20 ఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9) జరుగుతుంది.
🚨
— Cricbuzz (@cricbuzz) October 8, 2024
Mahmudullah has announced that he will retire from T20Is after the India series. #Mahmudullah #IndvBan pic.twitter.com/3JtNZqZdAy