
పాట్నా: లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా మళ్లీ ఎంపీగా గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె..తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ పై 56,705 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు.
మహువా మొయిత్రా మొత్తం 6,28,789 ఓట్లను పొందగా..అమృతా రాయ్ కి 5,72,084 ఓట్లు వచ్చాయి. మొయిత్రా గతేడాది క్యాష్ ఫర్ క్వరీ కేసులో బహిష్కరణకు గురయ్యారు.దాంతో ఆమె రాజకీయ ప్రస్తానం ముగిసిందని అందరూ భావించారు. కానీ ఆమెకు టీఎంసీ అండగా నిలిచింది.