మాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలి

మాలె: తమ దేశంలోని భారతీయ బలగాలను మే 10 లోపు వెనక్కి పంపుతామని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్  మొయిజ్జు అన్నారు. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రశ్నే లేదన్నారు. కోల్పోయిన సముద్ర భూభాగాన్ని రికవర్  చేస్తామన్నారు. ‘నా పాలకవర్గానికి దేశ ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. ఫోర్సెస్​ను వెనక్కి తీసుకోవాలని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ముందుగా మార్చి 10 లోపు మిలటరీ బలగాలను, మిగిలిన బలగాలను మే 10 లోపు వెనక్కి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని మొయిజ్జు చెప్పారు.