బ్యాటరీల గోదాంలో రూ.50 లక్షలు చోరీ

బ్యాటరీల గోదాంలో రూ.50 లక్షలు చోరీ
  • నలుగురు అరెస్ట్.. రూ.16లక్షలు రికవరీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: బ్యాటరీల గోదాంలో రూ.50లక్షలు చోరీ కేసును మైలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు ఛేదించారు. గురువారం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16 లక్షలు రికవరీ చేశారు. చోరీకి వినియోగించిన బైక్, కారు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో గత నెల 21న జరిగిన దోపిడీ వివరాలను మైలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ నరేందర్, డీఐ‌‌‌‌‌‌‌‌ తిమ్మప్పతో కలిసి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.

 కాటేదాన్ పరిధిలోని భారతి ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన బ్యాటరీ గోదాంలో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ ఉందని మైలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి ఒవైసీ హిల్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన షేక్​మహ్మద్‌‌‌‌‌‌‌‌ అఖిల్‌‌‌‌‌‌‌‌(25), షేక్‌‌‌‌‌‌‌‌ అద్నాన్‌‌‌‌‌‌‌‌(21), ముస్తఫానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌‌‌‌‌ షఫీ(25), ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా వట్టేపల్లికి చెందిన సయ్యద్ మోసిన్‌‌‌‌‌‌‌‌(28) తెలుసుకున్నారు. ఎలాగైనా డబ్బును కొట్టేయాలని ప్లాన్​చేశారు. గత నెల 20న పాతబస్తీకి చెందిన సల్మాన్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి వద్ద ఇన్నోవా కారును రెంట్‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత కారులో భారతి ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరుకున్నారు. 

తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో గోదాంలోకి చొరబడ్డారు. కత్తులతో వాచ్‌‌‌‌‌‌‌‌మన్, వర్కర్‌‌‌‌‌‌‌‌ నరేష్‌‌‌‌‌‌‌‌కుమార్, కిషన్‌‌‌‌‌‌‌‌ ను బెదిరించారు. అక్కడి అల్మరాను ఐరన్ రాడ్లతో పగలగొట్టి రూ.50 లక్షలు దోచేసి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత సమాచారం అందుకున్న భారతి ట్రేడర్స్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేందర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ నరేందర్‌‌‌‌‌‌‌‌, డిటెక్టివ్​ఇన్​స్పెక్టర్​తిమ్మప్పతో కలిసి స్పెషల్​టీమ్స్ ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా శాస్త్రీపురంలో అఖిల్‌‌‌‌‌‌‌‌, అద్నాన్‌‌‌‌‌‌‌‌, షఫీ, మోసిన్‌‌‌‌‌‌‌‌ ను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు.