
గద్వాల,వెలుగు: వ్యవసాయ శాఖకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లు అమ్మిన కేసులో ప్రధాన నిందితుడిని గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల డీఎస్పీ మొగులయ్య బుధవారం ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపారు. ఈ నెల 25న మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతుండగా గద్వాల టౌన్ పోలీసులు రైడ్ చేసి ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికెట్ ఒక్కటి రూ. 70 వేలకు అమ్మినట్టు తేలింది.
మిర్యాలగూడ కేంద్రంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ ఇప్పటివరకు12 ఫేక్ సర్టిఫికెట్లు అమ్మినట్టు గుర్తించామని చెప్పారు. ఇందులో ప్రధాన నిందితుడు 6, ఏజెంట్లు మరో 6 ఫేక్ సర్టిఫికెట్లు విక్రయించినట్టు తేలిందని పేర్కొన్నారు. నిందితుడు బాలకృష్ణకు సహకరించిన మరొకరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇదివరకే ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సీఐ శీను, గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ ఉన్నారు.