
చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులోని ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరయ్యింది. వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీ పేరుతో 20 మందితో కలిసి పిబ్రవరి 7న రంగరాజన్ ఇంటికి చేరుకుని దాడి చేశాడు.
ఈ ఘటనలో ఏ–1 వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రిమాండ్ ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. 56 రోజుల పాటు జైలు జీవితం తర్వాత శనివారం రాజేంద్రనగర్ కోర్టు వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.