28 ప్రాణాలును బలిగొన్న గుజరాత్ లోని రాజ్ కోట్ టీఆర్ పీ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రధాని నిందితుడు థవల్ కార్పొరేషన్ యజమాని ధవల్ ఠక్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నిందితుడు ధవల్ ఠక్కర్ ను క్రైమ్ బ్రాంచి పోలీసులు, రాజ్ కోట్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేయగా..గేమింగ్ జోన్ యజమాని సహా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోముగ్గురు పరారీలో ఉన్నారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ కోర్టు అగ్నిప్రమాద కేసులో అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులకు 14 రోజుల పోలీసు రిమాండ్ విధించింది. ఈ కేసులో థవల్ కార్పొరేషన్ యజమాని ధవల్ ఠక్కర్, రేస్ వే ఎంటర్ ప్రైజెస్ అశోక్ సిన్హా జడేజా, కిరిత్ సిన్హ్ జడేజా, ప్రకాష్ చంద్ హిరాన్, యువరాజ్ సింగ్ సోలంకి, రాహుల్ రాథోడ్ నిందితులుగా ఉన్నారు. ఐపీసీ సెక్షన్లు 304,308, 337, 338, 114 ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనలో ఏడుగురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇద్దరు ఎస్ఐలు సహా ఏడుగురిని సస్పెండ్ చేశారు. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ జైదీప్ చౌదరి, ఆర్‌ఎంసి అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గౌతమ్ జోషి, రాజ్‌కోట్ రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎంఆర్ సుమ, పరాస్ కొఠియా, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు వీఆర్ పటేల్, ఎన్‌ఐ రాథోడ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయా శాఖలు జారీ చేసిన ఉత్తర్వులు. RMC కలవాడ్ రోడ్ ఫైర్ స్టేషన్ 'స్టేషన్ ఆఫీసర్' రోహిత్ విగోరాను సస్పెండ్ చేస్తూ RMC ఆ తర్వాత ఆదేశించింది.
మే 25 సాయంత్రం రాజ్‌కోట్‌లోని నానా మా ప్రాంతంలోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులతో సహా 28 మంది సజీవదహనమయిన విష యం తెలిసిందే. అగ్ని ప్రమాదాన్ని మానవ నిర్మిత విపత్తుగా గుజరాత్ హైకోర్టు పేర్కొంది. పెట్రోలు, ఫైబర్‌లు. ఫైబర్‌గ్లాస్ షీట్ల వంటి మండే పదార్థాల స్టాక్ నిల్వలు గేమ్ జోన్ నిల్వ ఉంచినట్లు హెచ్ సీ గుర్తించింది.
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతోపాటు కేంద్రం చనిపోయిన ప్రతి వ్యక్తి బంధువులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.