
సౌత్ బ్యూటీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవలే ఆమెకు సంబంధించిన డీప్ఫేక్ వీడియో(Deepfake Video) ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయం టాలీవుడ్ లోనే కాదు..దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. స్టార్ సెలబ్రెటీస్ అందరు ఈ వీడియోపై స్పందించారు. ఆ ఫేక్ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
లేటెస్ట్గా ఈ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళా శనివారం దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. ఇప్పటికే టాప్ సెలబ్రెటీస్ అయిన.. కత్రినా కైఫ్, కాజోల్, అలియాభట్ లతో సహా పలువురు ఇతర నటీమణులు AI టెక్నాలజీ దుర్వినియోగానికి గురైన వారే.
Delhi | Main accused in the case of deep fake profiles of actor Rashmika Mandana arrested: DCP Hemant Tiwari, IFSO Unit
— ANI (@ANI) January 20, 2024
అసలేం జరిగింది:
గతేడాది నవంబర్ 11న బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరాపటేల్ వీడియోకి రష్మికా మందన్నా ముఖంతో మార్ఫింగ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ నగర పోలీసులకు నోటీసు పంపడంతో ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO), ఈ కేసుకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) మరియు 469 (పరువుకు హాని కలిగించడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు. ఇక పోలీసులు వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసాక రష్మిక ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read : నా బయోగ్రఫీ రాసే బాధ్యత అతనికే అప్పగిస్తున్నా:మెగాస్టార్ చిరంజీవి
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్(Allu arjun) సరసన పుష్ప2(Pushpa2 the rule) సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాదికి ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Delhi Police arrested the main accused identified as Eemani Naveen in the actress Rashmika Mandanna deepfake video case. https://t.co/rl7zywHtb9 pic.twitter.com/aOPJ9Ioqiy
— ANI (@ANI) January 20, 2024