
సౌత్ బ్యూటీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవలే ఆమెకు సంబంధించిన డీప్ఫేక్ వీడియో(Deepfake Video) ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢీల్లీ పోలీసులని కేంద్రం ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ కేసుని ముమ్మరం చేశారు. ఎట్టకేలకు రష్మిక ఫేక్ వీడియో నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.
రష్మిక డీప్ఫేక్ వీడియోలో ప్రధాన నిందుతుడు ఈమని నవీన్ ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డీసీపీ హేమంత్ తెలిపారు. అలాగే నవీన్ B.Tech చదువుతున్నాడని..అతను 2019లో Google గ్యారేజ్ నుండి డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సును కూడా పూర్తి చేసాడని తెలిపారు. అంతేకాకుండా..ప్రస్తుతం అతను మూడు ఫ్యాన్ పేజీలను నడుపుతున్నాడని..వాటిలో ఒకటి రష్మిక మందన్నకి చెందినదని..కానీ రష్మిక అకౌంట్ కి తగినంత మంది ఫాలోవర్లు లేకపోవడం వల్ల..డీప్‌ఫేక్ వీడియోను నవీన్ క్రియేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అలా అక్టోబర్ 13న ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీలో రష్మిక వీడియోని నవీన్ పోస్ట్ చేసినట్లు..ఆ తర్వాత ఫాలోవర్లు 90k నుండి లక్షకు పైగా పెరిగారని పోలీసులు కీలకమైన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతానికి నవీన్ డిలీట్ చేసిన పూర్తి డేటాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు..అలాగే ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వివరిస్తామని డీసీపీ హేమంత్ తెలిపారు.
ఇప్పటికే ఈ డీప్ఫేక్ ఎఫెక్ట్ టాప్ సెలబ్రెటీస్ అయిన..కత్రినా కైఫ్, కాజోల్, అలియాభట్ లతో సహా పలువురు ఇతర నటీమణులు AI టెక్నాలజీ దుర్వినియోగానికి గురైన వారే. కేవలం స్టార్స్ నే కాకుండా..కొంతమంది రాజకీయ నాయకులు కూడా AI టెక్నాలజీ బారిన పడ్డారు.త్వరలో ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Delhi Police arrested the main accused identified as Eemani Naveen in the actress Rashmika Mandanna deepfake video case. https://t.co/rl7zywHtb9 pic.twitter.com/aOPJ9Ioqiy
— ANI (@ANI) January 20, 2024