సీఎం కేసీఆర్​కు ప్రజలు చెక్​ పెట్టారు : మైనంపల్లి హన్మంతరావు

సీఎం కేసీఆర్​కు ప్రజలు చెక్​ పెట్టారు :  మైనంపల్లి హన్మంతరావు

రామాయంపేట, వెలుగు: కేసీఆర్ మాయ మాటలకు ప్రజలు చెక్ పెట్టారని మల్కాజి గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లావణ్య ఓటు వేసేందుకు గురువారం సొంతూరుకు వస్తున్న క్రమంలో తూప్రాన్​ టోల్​ గేట్​ సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. విషయం తెలిసి ఎమ్మెల్యే హన్మంతరావు శుక్రవారం రామాయంపేట మండలం దామరచెర్వులో ఉన్నలావణ్య కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్  నుంచి ఎమ్మెల్యే లు ఎవరూ బీఆర్ఎస్ లోకి పోరని, అక్కడి నుంచే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. కేటీఆర్ సైతం సిరిసిల్లలో గెలవడం కష్టమే అన్నారు.