
- బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై మెదక్ ఎమ్మెల్యే ఫైర్
- హరీశ్‌రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు
- గరంగరంగా మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్
మెదక్, వెలుగు: డబ్బుకు అమ్ముడు పోయిన నువ్వా నన్ను ప్రశ్నించేది అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 5వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్మామిళ్ల ఆంజనేయులు మీద ఫైర్అయ్యారు. చైర్మన్చంద్రపాల్అధ్యక్షతన మంగళవారం జరిగిన మెదక్ మున్సిపల్బడ్జెట్ మీటింగ్ గరం గరంగా సాగింది. మీటింగ్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఎమ్మెల్యే రోహిత్ మధ్య స్కీమ్‌ల మీద చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ఆంజనేయులు లేచి ఇది బడ్జెట్మీటింగ్అనుకున్నారా? లేదా? రాజకీయ వేదిక అనుకున్నారా అని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ 'పైసలకు అమ్ముడు పోయిన నువ్వా నా గురించి మాట్లాడేది' అని మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ను తిట్టిన నువ్వు పది లక్షలు ఇవ్వనందుకు అమ్ముడు పోయినవు అని ఆరోపించారు. వయసుకు మర్యాద ఇస్తున్నా.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదన్నారు.
మెదక్ అభివృద్ధిని అడ్డుకోమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చెంచాలను పంపిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోహిత్, కౌన్సిలర్ఆంజనేయులు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటున్నారు కానీ ఏమైనా పనులు అవుతున్నాయా అని ఎమ్మెల్యే కౌన్సిలర్లను ప్రశ్నించారు. పదేండ్లుగా మీ ఎమ్మెల్యే, మీ గవర్నమెంటే కదా ఉన్నది అప్పుడెందుకు నిధుల గురించి, పనుల గురించి మున్సిపల్ మీటింగ్‌లో మాట్లాడలేదని నిలదీశారు. తాను మెదక్ ప్రజల అభిమానంతో గెలిచానని, పట్టణ అభివృద్ధికోసం, ప్రజల కోసం సేవచేస్తానన్నారు.
రూ.50.91 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
2024--, 25 ఆర్థిక సంవత్సరానికి రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌కు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. టాక్స్‌లు, అద్దెలు, పర్మిషన్లు, ఇతర పద్దుల ద్వారా 50 కోట్ల 91 లక్షల 50 వేల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. వివిధ అవసరాలకు 50 కోట్ల 89 లక్షల 50 వేల రూపాయలు వ్యయం అవుతుందని, 2 లక్షలు మిగులు బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా అమోదించింది.