సందీప్ కిషన్ హీరోగా ‘ధమాకా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్. అన్షు సాగర్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘పదిహేనేళ్ల కెరీర్‌లో ఇది నా 30వ సినిమా. డిఫరెంట్ స్ర్కిప్ట్‌లను ఎంపిక చేసుకుంటూ వస్తున్నా. రీసెంట్ టైమ్స్‌లో సీరియస్ మూవీస్ చేస్తున్నా. ఈసారి అందర్నీ ఎంటర్‌టైన్ చేసే సినిమా చేయాలనుకున్నా. త్రినాథరావు, ప్రసన్న కుమార్ ప్యాషనేట్ పర్సన్స్. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పాడు.
మీరా పాత్రలో అందర్నీ అలరిస్తానంది రీతూ వర్మ. ఇరవై రెండేళ్ల తర్వాత ఇందులో నటించడం హ్యాపీ అంది అన్షు సాగర్. సందీప్‌కి తండ్రి పాత్రలో నవ్విస్తా అని అన్నారు రావు రమేష్. సినిమా విడదలైన తర్వాత సీట్లు కాదు గేట్లు పగులుతాయనిపిస్తోందని, అంత కామెడీ ఉంటుందని దర్శకుడు త్రినాథరావు అన్నారు. రాజేష్ దండా మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మా బ్యానర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని అన్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది.