![ఎలక్ట్రీషియన్ పోస్టులకు సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు](https://static.v6velugu.com/uploads/2022/09/Majgaon-Dock-Ship-Builders-Limited-Mumbai-invites-applications-for-1041-posts_zAq6y5FUal.jpg)
ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎలక్ట్రీషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్ లాంటి తదితర 1041 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: ఎలక్ట్రీషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్, హిందీ ట్రాన్స్‌లేటర్, రిగ్గర్, సేఫ్టీ ఇన్‌స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడిక్స్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్, సెయిల్ మేకర్ తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో)/ మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ / మెకానిక్ రేడియో & టీవీ తదితరాలు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు 18 నుంచి -38 ఏళ్లు ఉండాలి.