బోధన్, వెలుగు: నిజామాబాద్జిల్లా బోధన్‌లో ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణంగా హత్య చేశారు. టౌన్ సీఐ ప్రేమ్కుమార్తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రెంజల్బేస్కు చెందిన మాజీద్‌ఖాన్(24) అనే యువకుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి బోధన్, శక్కర్నగర్ప్రాంతంలోని కూలిన ఓ పాత ఇంట్లో మాజీద్ఖాన్రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో అతడికుటుంబసభ్యులకు ఫ్రెండ్ ఆరిఫ్ సమాచారం అందించాడు.
తీవ్ర గాయాలతో ఉన్న మాజీద్ఖాన్కు అతడి సోదరుడు సాజీద్, ఆరిఫ్ బోధన్గవర్నమెంట్హాస్పిటల్కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. మాజీద్ఖాన్స్నేహితులే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మాజీద్అన్న సాజీద్ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.