హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై శంషాబాద్ నుంచి మెహదీపట్నం వస్తున్న ఓ కారు NFDC వద్దకు రాగానే భారీ ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది టాక్సీ కారు. ప్రమాదంలో రెండు కార్లు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. కారుల్లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు యాక్సిడెంట్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యాక్సిడెంట్ కు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు తృటిలో ప్లై ఓవర్ పైనుంచి కింద పడే ప్రమాదం నుంచి బయట పడినట్టు పోలీసులు తెలిపారు. లేదంటే పెను ప్రమాదం జరుగుండేదని అన్నారు. యాక్సిడెంట్ కారణంగా PVNR ఎక్స్ ప్రెస్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి మెహదీపట్నం రూట్ ను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.