సికింద్రాబాద్లో బీభత్సం.. మూడు పల్టీలు కొట్టిన కారు

సికింద్రాబాద్లో బీభత్సం.. మూడు పల్టీలు కొట్టిన కారు

సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద కారు అదుపుతప్పి మూడు పల్టీలు కోట్టింది. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ క్లబ్ సర్కిల్ సిగ్నల్ వద్దకు ఓ ఎస్ యూవీ కారు వచ్చింది. సిగ్నిల్ పడుతుందనే తొందర్లో కారును డ్రైవర్ స్పీడుగా పోనిచ్చాడు. మరోవైపు నుంచి వస్తున్న ఓ కారు ఎస్ యూవీకి అడ్డుగా రావడంతో రెండు వాహనాలు ఢీ కొన్నాయి.

 సిగ్నల్ బ్రేక్ చేసిన కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారులోని వారు గాయాలతో బయటపడ్డారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాద దృష్ట్యలు సీసీ కెమెరాలో రికార్డు కాగా..వాటి ఆధరంగా దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు 

మరిన్ని వార్తలు