
శ్రీశైలం ఎగమగట్టు కాలువ (SLBC) పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. సొరంగం పైకప్పు కూలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. కొంత మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. కార్మికులను వెలికితేసేందుకు అధికారులు సహాయక చర్యలు చేస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట దగ్గర ఎడమవైపు సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ శబ్దాలు రావడంతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాద సమయంలో టన్నెల్లో దాదాపు 50 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి బయల్దేరారు. వీలైనంత త్వరగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
ప్రమాద సమయంలో SLBC టన్నెల్ లోపల 50 మంది కూలీలు ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు కార్మికులను బయటికి తీశారు. మిగతా వారి కోసం సహాయక చర్యలుముమ్మరం చేశారు.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి మద్దతు
ఎస్ ఎల్ బీసీ పనులు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఈమధ్యే ప్రారంభమయ్యాయి. అయితే సొరంగ మార్గం వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర పై కప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం ఇవాళ (శనివారం ఫిబ్రవరి 22) ఉదయం 8:30 కు జరిగినట్లు చెబుతున్నారు. 10 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ముగ్గురిని బయటకు తీశారు. చికిత్స కోసం జెన్కో ఆసుపత్రికి తరలించారు అధికారులు. గాయాల తీవ్రత ఎక్కువగా గాయాలు ఉంటే అచ్చంపేట లేదా నాగర్ కర్నూలు జిల్లా హెడ్ కోటర్ హాస్పిటల్ కు తీసుకెళ్లనున్నారు.