పంచాయతీకి పండుగ: ఊళ్ళల్లో రోడ్లు బాగుపడ్డట్లే.. బడ్జెట్లో రూ. 12 వందల కోట్లు

పంచాయతీకి పండుగ: ఊళ్ళల్లో రోడ్లు బాగుపడ్డట్లే.. బడ్జెట్లో రూ. 12 వందల కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.31,606 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • చేయూతకు రూ.14,861 కోట్లు కేటాయింపు
  • మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గీర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిల చెల్లింపులకు రూ.6 వేల కోట్లు
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణకు రూ.1,220 కోట్లు
  • ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఆత్మీయ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోసాకు రూ.600 కోట్లు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్​లో రూ.31,606 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్​తో పోలిస్తే సుమారు రూ.1,790 కోట్లు అధికంగా అలకేట్ చేసింది. ఈ సారి చేయూత పింఛన్ల కోసం రూ.14,861 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్లో ఆసరా (చేయూత) కోసం రూ.14,628 కోట్లు ప్రకటించారు. అంటే.. గతంలో పోలిస్తే రూ.233 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం నిరుపేద కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నది. 

ఈ పథకం కోసం రూ.600 కోట్లు ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖలో భాగంగా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.11,604 కోట్లు కేటాయించారు. నీటి సరఫరా, పారిశుధ్యం వంటి వాటికి మొత్తం రూ2,072 కోట్లు, మొత్తం గ్రామీణాభివృద్ధికి  రూ.13,677 కోట్లు అలకేట్ చేశారు. మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గీర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిల చెల్లింపుల కోసం రూ.6,000 కోట్లు కేటాయించింది. స్టేట్ ఫైనాన్స్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ గ్రాంట్స్ కింద రూ.2,062 కోట్ల కేటాయింపులు జరిపారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం రూ.1,220 కోట్లు కేటాయించింది. వీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 

హ్యామ్ విధానంలో గ్రామీణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణం కోసం రూ.200 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శాఖకు సంబంధించి రోడ్లు, వంతెనల కోసం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,166 కోట్లు అలకేట్ చేసింది. చీఫ్ ఇంజినీరు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, ఇతర పెట్టుబడులకు రూ.909 కోట్ల కేటాయింపులు జరిపారు. ఇక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో భాగంగా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ.11,604 కోట్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సహాయక గ్రాంట్లు, ఇతర సహాయ గ్రాంట్లు మొత్తం రూ.892 కోట్లు కేటాయించారు.

ఇందిరా మహిళా శక్తికి భారీగా రుణాలు

మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళా సంఘాలకు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డీ లేని రుణాల కింద రూ.1,511 కోట్లు కేటాయించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు రూ.20 వేల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఈ టార్గెట్​ను అధిగమించి రూ.21,632 కోట్ల రుణాలు అందించింది. దీని ద్వారా 2.25 లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించడంతో పాటు మహిళల ఉపాధికి భరోసా లభించింది. 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు  ప్రారంభించారు. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.110 కోట్లు  కేటాయించింది. 

స్వయం సహాయక సంఘాలకు స్టూడెంట్ల యూనిఫామ్​లు కుట్టే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. యూనిఫాం కుట్టు చార్జీలను జతకు రూ.75కు పెంచింది. నేటి వరకు స్వయం సహాయక సంఘాలు 37.5 లక్షల యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కుట్టడం ద్వారా దాదాపు రూ.28 కోట్ల ఆదాయాన్ని పొందారు. మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతీ మండలంలో వారితో రైసు మిల్లులు, మినీ గోదాములు స్థాపించి, నిర్వహించేలా సహాయ సహకారాలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి, ఎఫ్​సీఐకి సర ఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించింది. 

మహిళల ఆర్థిక భద్రత కోసం బీమా స్కీమ్

మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక బీమా పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రుణ బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఎవరైనా ఒక సభ్యురాలు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షలు అందించేందుకు కేటాయింపులు జరిపింది. రిటైల్, రవాణా రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. 

నారాయణపేటలో రూ.1.23 కోట్లతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో బంకు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించింది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను అప్పగిస్తుంది.  ఇందు కోసం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నది. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనున్నది.

డిపార్ట్​మెంట్ బడ్జెట్ అంచనాలు (రూ.కోట్లలో)

  • ఆర్థిక శాఖ  54,008
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి31,605
  • అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన 24,439
  • ఇరిగేషన్ 23,373 
  • ఎనర్జీ 21,221
  • సెకండరీ ఎడ్యుకేషన్ 19,464
  • మున్సిపల్ ​అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి 17,677
  • హౌసింగ్​ 14,154
  • హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 12,393
  • ఎస్సీడెవలప్​మెంట్ 11,561
  • బీసీ వెల్ఫేర్ 11,405
  • హోం శాఖ 10,188
  • ఎస్టీ వెల్ఫేర్ 7,522
  • రోడ్లు భవనాలు 5,907
  • సివిల్ సప్లయ్స్ 5,734
  • పరిశ్రమలు, వాణిజ్యం 3,898
  • ప్లానింగ్ 3,863
  • .ఉన్నత విద్య 3,643
  • మైనార్టీ సంక్షేమం 3,591
  • మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు 2,862
  • న్యాయశాఖ 2,453
  • రెవెన్యూ 2,369
  • పశు సంవర్థకం, మత్స్యశాఖ 1,674 
  • యువజన, పర్యాటక, సాంస్కృతికం 1,411
  • సాధారణ పరిపాలన (జీఏడీ) 1,112
  • పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ 1,023
  • కార్మిక, ఉపాధి కల్పన 900
  • ఐటీ, కమ్యూనికేషన్లు 774
  •  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ 4,485
  • లెజిస్లేచర్  255