గుజరాత్‌లోని పారిశ్రామిక ప్రాంతం దహేజ్‌లోని ఇవాళ(బుధవారం) ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడుతుండడంతో సమీపంలోని గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
మధ్యాహ్నం ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో దాదాపు 40 మంది కార్మికులకు మంటలు అంటుకున్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని భారుచ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారని తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారుచ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.