
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సన్యాల్ అడవుల్లో టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య గురువారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పుల్లోనే ఇద్దరు టెర్రరిస్టులు కూడా చనిపోయారు. ఇంకా నాలుగురు టెర్రరిస్టులు ఆ ప్రాంతంలోనే దాక్కున్నారు.
సన్యాల్ అడవుల్లో నాలుగు రోజులుగా ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సరిహద్దు భద్రతా దళం, పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం బృందాలు.. టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌కు హెలికాప్టర్లు, డ్రోన్లు, బుల్లెట్‌ప్రూఫ్ వెహికల్స్, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు గ్రనేడ్‌లతో పాటు ఇతర పెలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.