మధ్యప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలిన బాంబులు..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని హర్దా పట్టణంలో ఉన్న ఒక బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి చుట్టూ ఉన్న ఇండ్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇండ్లకు మంటలు అంటున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో అనేక మంది వ్యక్తులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది.

మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ ఘటన పై తక్షణమే అంచనా వేయండని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలాన్ని సందర్శించాలని మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, డీజీపీ అరవింద్ కుమార్‌లను ఆదేశించారు.