భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మణుగూరు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఒకటో యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ పోలీసులు ఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనలో ఎవరికైనా హాని జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.