చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం

చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి  పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ( ఫిబ్రవరి 4) సాయంత్రం చర్లపల్లి సుగుణ కెమి కల్ ఫ్యాక్టరీలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ప్రాణ, ఆస్థినష్టం గురించి తెలియాల్సి ఉంది. 

ALSO READ | మొబైల్ బానిసలుగా ఇండియన్స్..రాత్రీపగలూ లేకుండా సెల్ఫోన్లోనే..