కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన సెల్ ఫోన్లు

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన సెల్ ఫోన్లు

హైదరాబాద్  కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  కెపీహెచ్ బీ ఫేజ్ 3లోని ఎల్ఐజీ 16/11,12  ఫ్లాట్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షణ్ముఖ పవన్ అనే వ్యక్తి ఈ ప్లాట్ ను సెల్ ఫోన్ స్టాక్ రూంగా ఉపయోగిస్తున్నాడు. ఇవాళ ఆగస్ట్ 7 2024 మధ్యాహ్నాం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు క్రమంగా పెరగడంతో రెండు ఫ్లాట్స్ కి వ్యాపించాయి. 

మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సెల్ ఫోన్లు వాటికి సంభందించిన బ్యాటరీలు అన్ని పూర్తిగా మంటల్లో కాలి బూడిదైనట్టు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రూములో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని  పోలీసులు తెలిపారు.