ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి వీ.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పరుగుతీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఘటనలో చెప్పులు దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఆ షాపు పైన ఓ ఇల్లు ఉందని దుకాణం యజమాని తెలిపాడు. ఆ ఇంట్లో సిలిండర్లు ఉన్నాయని చెప్పాడు. ఇంట్లో నుండి ప్రతి మూడు నిమిషాలకు భారీగా సౌండ్లు వినిపిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.