హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హోటల్ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో హోటల్ మొత్తం అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 

 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. హోటల్లోని మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం జరిగిందని  ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. ప్రస్తుతం పార్క్ హయత్ హోటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తినష్టం జరిగినట్లుగా తెలిపారు. 

►ALSO READ | పెళ్లైన మూడు రోజులకే.. ఫలక్‌నుమా రౌడీ షీటర్ దారుణ హత్య