జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం..50షాపులు, రెస్టారెంట్లు దగ్ధం

జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం..50షాపులు, రెస్టారెంట్లు దగ్ధం

 జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం (ఫిబ్రవరి 8) సోనామార్గ్ లోని మార్కెట్ లో షాపులకు ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఓ షాపులో చెలరేగిన మంటలు  పదుల సంఖ్యలో షాపులు వ్యాపించాయి. 

దాదాపు 45 షాపులకు పైగా మంటల్లో కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ అధికారులు తెలిపారు.