![గోనె సంచుల గోదాంలో అగ్ని ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2025/02/major-fire-broke-out-in-gcc-gunny-bag-godown-in-utnoor-mandal_tQCSAarvEh.jpg)
ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ పరిధిలోని జీసీసీ గోనె సంచుల గోదాంలో ఆదివారం సాయంత్రం అగ్ని భారీ ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
అయితే భారీగా మంటలు ఎగిసిపడడంతో శ్రమించి రాత్రికి అదుపులోకి తీసుకొచ్చారు. గోదాంలో ఉన్న గన్నీ సంచులను జేసీబీతో బయటకు తీశారు. దాదాపు రూ.25 లక్షల విలువ చేసే గన్నీ సంచులు గోదాములో ఉండగా.. అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.