ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం..క్లాత్ షోరూంలో మంటలు.. భయంతో జనం పరుగులు

ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం..క్లాత్ షోరూంలో మంటలు.. భయంతో జనం పరుగులు

హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ( మార్చి7) రాత్రి  హైకోర్టు సమీపంలోని ఝాన్సీ బజార్ లోని ఓ క్లాత్ షోరూంలో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. భవనం మూడో అంతస్తులో చెలరేగిన మంటలు ఐదో అంతస్తుకు వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు శ్రమిస్తోంది. భవనంలో ఉన్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు  చేపట్టారు. కొంతమందిని బయటికి తీసుకురాగలిగారు. ఆస్థి, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.