
హైదరాబాద్: సిటీ శివారు హయత్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (మార్చి 31) సాయంత్రం సామనగర్లో ఉన్న ఓ స్ర్కాప్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు అంతటా వ్యాపించడంతో గోడౌన్ దగ్ధమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటలు భారీగా ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగింది..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటికే తెలియరాలేదు. ప్రమాద సమయంలో గౌడౌన్లో కార్మికులు ఉన్నారా.. లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.