
ఐపీఎల్ 18లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లకు లక్నో సూజర్ జైయింట్స్ పంత్‌ను కొనుగోలు చేసింది. అంతేకాకుండా లక్నో జట్టు పగ్గాలను కూడా అతడికే అప్పగించింది. దీంతో ఈ సీజన్ ప్రారంభానికి ముందు అందరి దృష్టి పంత్ పైనే ఉంది. రూ.27 కోట్లకు పంత్ న్యాయం చేస్తాడా..? తన దూకుడును ఈ సీజన్లో కొనసాగిస్తాడా..? అని డిబేట్స్ జరిగాయి.
తీరా.. లీగ్ ప్రారంభమయ్యాక చూస్తే సీన్ మొత్తం రివర్స్. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా రెండింట్లోనూ పంత్ విఫలయ్యాడు. మొదటి ఐదు మ్యాచుల్లో కేవలం 40 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాఫ్ షో చేశాడు. మార్ష్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో విజయాలు సాధించడంతో కెప్టెన్‌గా గట్టెక్కాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో విఫలమైన సోమవారం (ఏప్రిల్ 14) సీఎస్కేతో జరిగిన మ్యాచులో రాణించాడు. తన దూకుడైన శైలీకి భిన్నంగా 49 బంతుల్లో 63 పరుగులు చేసి సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే ఈ మ్యాచులో స్పిన్నర్లను ఎదుర్కొవడంలో పంత్ తడబడ్డాడు. ఎక్కువ డాట్ బాల్స్ ఆడి ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ టెక్ని్క్లోని ప్రధాన లోపాన్ని ఎత్తిచూపాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. పంత్ బ్యాటింగ్‌లో తడబడటానికి కారణం చెప్పిన జాఫర్.. దానిని అధిగమించడానికి కావాల్సిన టెక్నిక్ కూడా చెప్పాడు.
Also Read :- పరువు పోగొట్టుకున్న శ్రేయాస్.. ప్లేయింగ్ 11 మర్చిపోయి బిక్క ముఖం
‘‘పంత్ బ్యాటింగ్‌లో ప్రధాన సమస్య స్ట్రైక్ రొటేట్ చేయకపోవడం. సేఎస్కేతో జరిగిన మ్యాచులో మిడిల్ ఓవర్లలో పంత్ సరిగ్గా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొలేక ఎక్కువ డాట్ బాల్స్ ఆడాడు. అలా కాకుండా స్ట్రైక్ రొటేట్ చేయాలి. స్ట్రైక్ రొటేట్ చేయడంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాస్టర్. కాబట్టి ఒత్తిడి ఉన్న సమయంలో స్ట్రైక్ ఎలా రొటేట్ చేయాలో పంత్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి.
అలాగే.. కోహ్లీ మాదిరిగా గ్రౌండ్‌కు ఇరువైపులా ఆడాలి. కానీ పంత్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు, స్క్వేర్ లెగ్ వైపు, కౌ కార్నర్ వైపు షాట్లు కొట్టడానికే ప్రయత్నిస్తాడు. పంత్ బలహీనత కనిపెట్టిన ప్రత్యర్థులు అక్కడ ఫీల్డర్లను మోహరిస్తుండటంతో రిషబ్ ఔట్ అయిపోతున్నాడు. స్ట్రైట్ ఆడేందుకు కూడా పంత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడు. కాబట్టి మైదానంలో ఇరువైపులా బంతిని కొట్టడం, స్ట్రైక్ రొటేట్ చేయడంలో అతడ మరింత మెరుగు అవ్వాలి’’ అని బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు జాఫర్.