ఇది పాన్ ఇండియా మూవీ కాదు..ఆల్ ఇండియా మూవీ

ఇది పాన్ ఇండియా మూవీ కాదు..ఆల్ ఇండియా మూవీ

మేజర్ సినిమా ఒక సినిమా కాదు..ఎమోషన్ అన్నారు హీరో అడవి శేషు. మేజర్ సినిమాను నిజాయితీగా తీశామని చెప్పారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎంత దేశభక్తి, స్ఫూర్తి ఉందో.. అదంతా సినిమాలో చూపించే ప్రయత్నం చేశామన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం చాలామందికి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతోనే మూవీని తీసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు సినిమానే కాదు..ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో మొదటి సారిగా అందరికి సినిమాను చూపించి..ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నామన్నారు అడవి శేషు. మేజర్ సినిమాను మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. తాను ఎప్పటికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అవ్వలేనన్నాడు అడవి శేషు. కానీ సందీప్ పెరెంట్స్ కు తాను రెండో కొడుకుగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అడవి శేషు ధన్యవాదాలు తెలిపారు. మేజర్ సందీప్ తో కలిసి పని చేసిన వారు..ఆయన కింద శిక్షణ పొందిన వాళ్లు..ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉందన్నారు. ఇక మేజర్ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.