- ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల్లో తప్పని త్రిముఖ పోటీ?
నల్గొండ, వెలుగు : ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. ఈ నియోజకవర్గ కేంద్రంగానే జిల్లా రాజకీయాలు మలుపులు తిరగనున్నాయి. బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడంతో లెఫ్ట్ పార్టీలు తమదారి చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఉప ఎన్నికల్లో పొత్తుతో, ఇప్పుడు ఆ ధర్మాన్ని బీఆర్ఎస్ పక్కన పెట్టిందని కమ్యూ నిస్టులు అంటున్నారు. బీజేపీ నుంచి మళ్లీ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరిని వరిస్తోందో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.
మరోవైపు మునుగోడులో కమ్యూనిస్టుల ప్రణాళిక ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు 16 వేల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం వల్లే బీఆర్ఎస్ బైపోల్లో గట్టెక్కింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోవడంతో ఊహించనిరీతిలో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. మునుగోడులో 20 వేలు ఉన్న బీజేపీ ఓట్లు కాస్తా 86 వేలకు పెరిగాయి. సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 23 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పోలింగ్ పర్సంటేజీ తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది.
అయితే బీఆర్ఎస్కు, కమ్యూనిస్టులు తోడవడంతో స్వల్ప తేడాతోనే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. ఉప ఎన్నికల వేడి మునుగోడులో ఇంకా చల్లారలేదు. ఏడాది తిరగకముందే అసెంబ్లీ ఎన్నికలు రా వడంతో మళ్లీ బైపోల్ తరహాలో ట్రయాంగిల్ వార్ ఎదుర్కోవాల్సి వస్తోందేమోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ త్రిముఖ పోటీ జరిగితే అప్పుడు అనుసరించాల్సిన వ్యూహాం పైన అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు
చేస్తున్నారు.
త్రిముఖ పోటీ ఉంటుందా?
ఉమ్మడి జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటే అంతిమంగా బీఆర్ఎస్కు లాభం జరుగుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ మునుగోడులో త్రిముఖ పోటీ ఎదురైతే మాత్రం బీఆర్ఎస్ అంచనాలు తప్పుతాయని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయ పడుతున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ దోస్తీ కడితే పొత్తులో భాగంగా సీపీఐకి ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు జరిగే త్రిముఖ పోటీలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. ఒక వేళ పొత్తులు లే కుండా మూడు పార్టీలు బరిలో దిగితే అప్పుడు కమ్యూనిస్టుల పాత్ర ఏం టనేది కూడా తేలిపోతుంది.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూ నిస్టుల టార్గెట్ బీజేపీ కాగా, ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీల టార్గెట్ బీఆ ర్ఎస్ కాబోతుంది. ఈ నెలాఖరులోగా కాం గ్రెస్, కమ్యూనిస్టుల అలయన్స్ పైన స్పష్టమైన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఈ పొత్తుల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు. దీన్నిబట్టే తమ రాజకీయ ఎత్తుగడలు ఉంటాయని పలువురు ముఖ్యనేతలు పార్టీ కేడర్‌కు సంకేతాలు పంపుతున్నారు. కొద్దిరో జుల నుంచి మునుగోడులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు పొత్తుల గు రించే రహస్య చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులను తమకు అనుకూ లంగా మల్చుకునేందుకు మునుగోడు నుంచి ఢిల్లీ వరకు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు.