మూడు దేశాల్లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ : కరెంట్ లేక వీధుల్లోకి జనం.. విమానాలు, రైళ్లు ఆగిపోయాయి

మూడు దేశాల్లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ : కరెంట్ లేక వీధుల్లోకి జనం.. విమానాలు, రైళ్లు ఆగిపోయాయి

మూడు దేశాలు అల్లకల్లోలం అయ్యాయి.. ఏం జరుగుతుందో తెలియక జనం వీధుల్లోకి వచ్చారు. రైళ్లు ఆగిపోయాయి.. విమానాలు సర్వీసులు బ్రేక్ అయ్యాయి. బస్సులు నిలిచిపోయాయి. మూడు దేశాల్లోనూ కరెంట్ లేదు.. దీంతో మొత్తం వ్యవస్థలు అన్నీ కుప్పకూలాయి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో పరిస్థితి ఇది. 2025, ఏప్రిల్ 28వ తేదీ ఉదయం ఈ పరిస్థితి తలెత్తింది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోవటంతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనం గందరగోళానికి గురయ్యారు.

అసలే.. డిజిటల్ యుగం... ఏం కావాలన్నా చేతి మునివేళ్లతో స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు క్షణాల్లో జరిగిపోయే పరిస్థితి ఉన్న రోజుల్లో కరెంటు లేకపోతే.. ఎంత గందరగోళం క్రియేట్ అవుతుందో ఈ మూడు దేశాల్లో పరిస్థితి చుస్తే అర్థమవుతుంది. సోమవారం ( ఏప్రిల్ 28 )స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో కరెంటు కట్ అవ్వడంతో ఆయా దేశ రాజధానులు స్తంభించిపోయాయి. మూడు దేశాల్లో ఉన్న సుమారు 50 మిలియన్ల మంది ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు.

  • పవర్ కట్ కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఆగిపోవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది
  • మెట్రో రైళ్లు కూడా ఆగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.
  • ఫోన్ లైన్స్ కూడా పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో కూడా తెలీని పరిస్థితి నెలకొంది.
  • ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి జనం విమానాశ్రయాలకు పరిమితం అయ్యారు.

పవర్ కట్ కి కారణం:

పవర్ కట్ కి కారణం ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. డొమెస్టిక్ మీడియా ప్రకారం.. యూరోపియన్ ఎలక్ట్రిక్ గ్రిడ్ లో సమస్యలే పవర్ కట్ కి కారణమని తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఫ్రాన్స్ లో అగ్నిప్రమాదం వల్ల హై వోల్టేజ్ పవర్ లైన్ దెబ్బతినడం కూడా కారణమని తెలుస్తోంది.