ఇదెక్కడి యాక్సిడెంట్ బాబోయ్.. వరంగల్-హైదరాబాద్ హైవేపై జరిగింది..!

యాదాద్రి: ఆలేరు వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో డీసీఎం డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం  డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్లడం వల్ల అదుపు తప్పి ఇలా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. పోలీసులు స్పాట్కు చేరుకుని ఆ డ్రైవర్ మృతదేహాన్ని అంబులెన్స్లో అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డీసీఎం బ్రిడ్జ్ పైకి ఎక్కే్యడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. అతి వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ALSO READ | ఆరాంఘర్‎లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికుల పరుగులు