
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనం జీపు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద కడప నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనాన్ని అతివేగంగా వచ్చిన జీపు ఢీ కొట్టింది. దీంతో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బొలేరోలో ఉన్న డ్రైవర్ , కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది
మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఒంటిమిట్ట, రాజంపేటకు చెందిన పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.