పటాన్​చెరు సమీపంలో పైప్​లైన్​కు లీకేజీ.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

 పటాన్​చెరు సమీపంలో పైప్​లైన్​కు లీకేజీ.. ఈ  ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
  • రోజంతా కొనసాగిన రిపేర్లు
  • పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

హైదరాబాద్​సిటీ, వెలుగు: పటాన్​చెరు సమీపంలోని మొఘల్‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌ వద్ద 1,500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ లైన్​కు ఆదివారం రాత్రి భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో సోమవారం బోర్డు అధికారులు రిపేర్లు మొదలుపెట్టారు. ఎండీ అశోక్‌‌‌‌ రెడ్డి అధికారులతో జూమ్ మీటింగ్‌‌‌‌ నిర్వహించి రిపేర్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

 ఈడీ మయాంక్ మిట్టల్ ఫీల్డ్​కు వెళ్లి రిపేర్లను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి వరకు పనులు చేసి లీకేజీని సరిచేశారు. అంతకుముందు వాటర్​సప్లయ్​నిలిచిపోయిన బీరంగూడ, అమీన్​పూర్, మియాపూర్, చందానగర్​ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు.