తిరువనంతపురం: అయప్ప భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న మకర జ్యోతి శబరిమలలో దర్శనం ఇచ్చింది. సంక్రాంతి పర్వదినాన శబరిమలలోని పొన్నాంబలమేడు పర్వఖ శిఖరాల్లో దేదీప్యమానంగా భక్తులకు మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు, స్వాములు పెద్ద ఎత్తున శబరికి తరలివచ్చారు. మకరజ్యోతిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శబరిగిరులు దద్దరిల్లిపోయాయి. శబరికి వెళ్లలేకపోయిన అయ్యప్ప భక్తులు.. మకర జ్యోతిని టీవీల్లో తిలకించి తన్మయత్వంలో పులకించిపోయారు.
మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు భారీగా ఏర్పాట్లు చేసింది. అయ్యప్ప స్వాములు, భక్తులు మకర జ్యోతిని స్వయంగా చూసేందుకు శబరికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఆలయ అధికారులు, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఈ సారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా మకర జ్యోతి దర్శనం పూర్తి అయ్యింది.
ALSO READ | నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్