భారతదేశం అంటేనే ఎక్కువగా పండుగలు జరుపుకునే దేశం. ఇక మన భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలు ముగిసిన కొన్ని రోజులకే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంటుంది. వేర్వేరు పేర్లతో విభిన్న రీతులలో జరుపుకునే ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రముఖమైనది. తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు, చేయకూడని పనులేమిటో మీకు తెలుసా..? తెలియకపోయినా పర్వాలేదు. మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి పండుగ వరకూ పొలాల్లో ఉన్న పంట, ధాన్యం ఇంటికి చేరిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున ప్రజలంతా సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే గంగా నదికి, గంగా నదికి దూరంగా ఉన్నవారు స్థానిక నదులలో స్నానం చేసి నదీ ఆశీర్వాదం కోసం అర్ఘ్యం సమర్పిస్తారు. మన పంటలు సమృద్ధికరంగా పండడానికి సూర్యుడు, నదుల నీరు ఎంతో కీలకమైనవి. ఆ కారణంగానే మకర సంక్రాంతి రోజున సూర్యుడికి, నదికి కృతజ్ఞతాభావంగా ప్రజలంతా పూజలు చేస్తారు.
మృగశిర రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజున ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈ ఏడాది(2024) కూడా జనవరి నెలలోనే వచ్చింది ఈ గాలిపటాల పండుగ. సకల జీవరాశులకు ప్రత్యక్ష దర్శనమిచ్చే సూర్య భగవానుడు ఈ నెల 15న మృగశిర రాశి నుంచి మకర రాశిలోని ప్రవేశించబోతున్నాడు. ఆ నేపథ్యంలోనే భారత్‌లో జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోనున్నాం.
మకర సంక్రాంతి రోజున తప్పక చేయవలసినవి
-
1.మకర సంక్రాంతి రోజున ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించడం ... ఇతరులతో అనుచితంగా ప్రవర్తించడం మానుకోవాలి.
-
2. సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుని పూజించాలంటే గంగా నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పించాలి. ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి. గంగా నది అందుబాటులో లేకపోతే.. దగ్గరలోని నది కాని.. లేదా ఇంట్లో ఉండే మోటారు దగ్గర స్నానం చేయాలి.
-
3.ఒకవేళ మీరు గంగా నదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తుంటే..ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి.
-
4. వ్యవసాయ భూములను ఉత్పాదకంగా ఉంచడంలో సహాయపడినందుకు నదులు, నీటి వనరులు, సూర్యుని వంటి ప్రకృతి జనకాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలా చేయడం జరుగుతుంది.
-
5. ఈ రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీ దేవిని కూడా పూజించాలి.
-
6. దేవతలకు టిల్ (నువ్వులు), బెల్లం, పెరుగు, తాజా వరి కోతతో చేసిన అన్నం, చివడ, అన్నం సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చు.
-
7. వీలైతే మీ ఇంటికి కొత్త చీపురు కొనండి.
-
8. నువ్వులు, బెల్లం లడ్డూలను తయారు చేయడం, దేవతలకు సమర్పించడం ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి.
-
9. పెద్దలు, పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి. పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది.
-
10. దయనీయ స్థితిలో ఇంకా అవసరమైన వారికి సహాయం చేయండి.
మకర సంక్రాంతి రోజున చేయకూడనివి
-
1.మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళల్లో తినకూడదు.
-
2.చెట్లు, మొక్కలను నరికివేయడం మానుకోవాలి. ఎందుకంటే మకర సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ప్రార్థించి, గౌరవించడం.
-
3.మాంసాహారం, మద్యం, పొగాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
-
4.వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలు ఎప్పుడూ తినకూడదు.
-
5.ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే, అతన్ని ఖాళీ చేతులతో వెళ్లనివ్వవద్దు. వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది
-
6.సంక్రాంతి పండుగ రోజున ఇతరులతో చెడుగా, అనుచితంగా ప్రవర్తించకూడదు.
నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం, సూర్య భగవానుడు, శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడం, గాలిపటాలు ఎగురవేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధపెట్టే లేదా ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు.