Sankranti Special : సంక్రాంతి పిండి వంటల్లో ఇంత ఆరోగ్యం ఉందా.. అందరూ వీటిని తినాల్సిందే..!

సంక్రాంతి.. మన కల్చర్ భాగం మాత్రమే కాదు..ఆరోగ్యాన్నిచ్చే పండుగ. అందుకే 'ఆరోగ్య సంక్రాంతి' అని కూడా పిలుస్తుంటారు. ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో అంశాలు సంక్రాంతితో ముడిపడి ఉన్నాయి. మూడు రోజులు ఆచరించే ప్రతి సంప్రదాయంలోనూ ఒక్కో విశేషం దాగి ఉంది. సుర్యుడు మేకర రాశిలోకి వచ్చే రోజే మకర సంక్రాంతి సూర్యుడు.  దక్షిణాయణం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలో అడుగుపెడతాడు. ఈ పండుగ సందర్భంగా చేసే గొబ్బెమ్మలు వాటి చుట్టూ పోసే నవధాన్యాలు. భోగి మంటలు, పిండి వంటకాలు, అందులో వాడే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు పని చేస్తాయి. చలికాలంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. అంటున్నారు. హెల్త్ ఎక్స్ పర్ట్స్..

పిండి వంటలు ప్రత్యేకం

సంక్రాంతి పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచే పిండి వంటలు చేయడంలో బిజీ అయిపోతారంతా. సుమారు నెలరోజుల వరకు సరిపోయే పిండివంటకాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే అతిథులకు ఆత్మీయులకు అవె  పెడతారు. వాటిలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జనవరిలో చలి నుంచి కాపాడుకునేందుకు సకినాల్లో వేసే ఓమ  బాగా పనిచేస్తుంది. అది శరీరంలోని వేడిని పెంచుతుంది. చలికాలంలో వాతం సమస్యలకు కూడా ఓమ దివ్యౌషధం.  సంక్రాంతి పండుగను మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో "సకినాల పండుగ " అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పండక్కి సకినాలు ప్రత్యేక వంటకం. సకినాలతోపాటు గారెలు, అరిసెలు, మురుకులు, కారప్పూసలు ఎక్కువగా చేస్తారు. వీటిని మితంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

నువ్వులు

సకినాల పిండిలో నువ్వులను కూడా పండుగలో కలుపుతారు. పండుగపూట బెల్లం కలిపి తయారు చేసుకునే నువ్వుల ఉండలు శరీరానికి క్యాల్షియం, ఫోలిక్ యాసిర్, ఐరన్ అందిస్తాయి బా లింతలకు పాలు అధికంగా వస్తాయి. చిన్న పిల్లలో చురుకుదనం పెరుగుతుంది.

పొంగలి

దంపుడు బియ్యం, బెల్లం, పాలతో చేసే పొంగలిలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది పిల్లలకు, పెద్దలకు పుష్టికరమైన ఆహారం. ఇందులో ఉన్న ప్రొటీన్లు, విటమిన్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

చెరుకు

చెరుకు గడల్లో క్యాల్షియం, చెరుకు రసంలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. చెరుకు ముక్కలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. ఆకలి పెరుగుతుంది. విరేచనాలు అతిసారంతో బాధపడుతున్న వాళ్లకు మెడిసిన్ గా  పనిచేస్తుంది

మామిడాకులు

ఇంటికి తోరణాలుగా కట్టుకునే మామిడాకులు, బంతిపూలు ఇంటి అందాన్ని పెంచుతాయి. అంతేకాదు. క్రిమిసంహారిణులుగా కూడా పనిచేస్తాయి. బ్యాక్టీరియాను ఇంటిలోకి రాకుండా

గొబ్బెమ్మ 

ఆవు మూత్రం, పేడలో ఎన్నో ఔషధ గుణాలు న్నాయి. గోమూత్రానికి శరీరంలోని టాక్సిన్లను తగ్గించే గుణం ఉంది. పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం, అలుకు (పేడనీళ్లు) వారిట్లో  చిలకడం వల్ల కీటకాలు.

భోగి మంటలు

భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులతో పాటు ఉత్తరేణి వేయడం వల్ల వచ్చే వాసన పీల్చితే ఉబ్బసం లాంటి జబ్బులు తగ్గుతాయి.

గుమ్మడికాయ

సంక్రాంతికి వినియోగించే గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంధీవాపుతో బాధపడేవాళ్లకు ఉపశమనం ఇస్తుంది.

100 గ్రాముల గుమ్మడికాయలో 62.5 శాతం. తేను 4.4 శాతం కొవ్వు 31 శాతం ప్రొటీస్తు ఉంటాయి. ఇది తినడం వల్ల కడుపులో నులి పురుగులు కూడా చనిపోతాయి. బలహీనత తగ్గుతుంది. పిల్లలు చురుకుగా ఉంటారు.

=== వెలుగు లైఫ్