తెలంగాణలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీ, కాలేజీలలో విద్యను అభ్యసించే విద్యార్థులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక సమస్య ఉంది. మెస్ బాగా లేకపోవడం, ప్రొఫెసర్లు లేకపోవడం, పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, కాలేజీల్లో కూడా ఇవే తరహా సమస్యలు ఉత్పన్నం అవ్వడంతో విదార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి యూనివర్సిటీకి ఒక ప్రత్యేక కమిటీ వేసి నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించి ఆ యూనివర్సిటీలలో, కాలేజీలలో సమస్యలను, లోపాలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. నిర్దిష్టమైన సమయంలో అని సమస్యలకు పరిష్కారం అయ్యేలా చేసి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేయవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
- వై. సంజీవ కుమార్,
స్కై ఫౌండేషన్