అంగన్ వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

  • తెలంగాణ కేంద్ర, రాష్ట్ర  కార్మిక సంఘాల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అంగన్ వాడీ ఉద్యోగులను పర్మినెంట్, కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐటీయూ స్టేట్ సెక్రటరీ పాలడుగు భాస్కర్, అంగన్ వాడీ యూనియన్ సెక్రటరీ జయలక్ష్మి, స్కైలాబ్ బాబు మాట్లాడుతూ..  సమ్మెపై  ప్రభుత్వం నిర్బంధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. చర్చలకు పిలవకుండా అప్రజాస్వామికంగా ముందుకు పోతుందని మండిపడ్డారు. ఈ ధర్నాకు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు తరలివచ్చారు.