
- ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
- ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్
కుంటాల, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రశ్నించే గొంతుకలైన మల్క కొమరయ్య, అంజి రెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్, 14 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని , ఇదే స్ఫూర్తితో రానున్న స్థానిక ఎన్ని కల్లో సత్తా చాటాలన్నారు. ముథోల్ ఇన్ చార్జి హరి నాయక్, శివ చరణ్, స్థానిక నాయకులు ఆప్క గజ్జరాం, పిప్పెర వెంగల్ రావు, జక్కుల గజేందర్, రమేశ్ గౌడ్, నవీన్, కల్యాణి గజేందర్, గోవర్ధన్ పాల్గొన్నారు