సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయినా..విన్నూత రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు.దొరికిన కాడి దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు జాబ్ లు,హనీట్రాప్ ,డిజిటల్ అరెస్ట్ లు మార్కెట్లలో ఇన్వెస్ట్ మెంట్ వంటి మోసాలు చూశాం. లేటెస్ట్ గా బీహార్ లో కొత్త తరహా మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. అదేంటంటే పిల్లలు లేని మహిళలను గర్భవతి చేస్తే రూ. 10 లక్షలు పొందవచ్చు..ఒక వేళ విఫలమైతే రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షలు పొందవచ్చు.ఇలా సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే.? బీహార్ లోని నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ తరహా మోసం బయటపడింది. కొందరు సైబర్ నేరగాళ్లు..ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లేబాయ్ సర్వీస్ పేరుతో పిల్లలు లేని మహిళలను గర్భవతి చేస్తే రూ. 10 లక్షలు ..ఒక వేళ విఫలమైతే రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పొందవచ్చని సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. ఇది చూసి ఆకర్షితులైన కొందరు వారికి కాల్ చేశారు. ఇదే ఆసరగా తీసుకున్న ముఠా సభ్యులు.. కస్టమర్ల పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ఫీల పేరుతో పలు వివరాలు సేకరించారు.
Also Read :- ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల రూ.2,026 కోట్ల నష్టం
తర్వాత పేరు రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్స్ కోసమని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకుంటే తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అందినకాడికి దోచుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇమ్రాన్ పర్వేజ్ తెలిపారు. ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని చెప్పారు. ముగ్గురు బీహార్ యువకులు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌లను అరెస్ట్ చేశాం. వారి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాట్సాప్ చాట్‌లు, కస్టమర్ల ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంకు లావాదేవీల సమాచారం రాబట్టామని తెలిపారు.