![గద్దర్ జయంతిని అధికారికంగా చేయండి : వెన్నెల](https://static.v6velugu.com/uploads/2024/01/make-gaddar-jayanti-official-says-vennella_Q0TjPkMpWR.jpg)
హైదరాబాద్, వెలుగు : ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన కూతురు వెన్నెల విజ్ఞప్తి చేశారు. బుధవారం సెక్రటేరియెట్‌లో బీసీ సంక్షేమ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన డిమాండ్‌ను మంత్రికి వివరించారు. జనవరి 31న గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున వెన్నెల పోటీ చేసిన విషయం తెలిసిందే.