ఈ డంప్లింగ్​ మేకర్​తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు

సంక్రాంతి వచ్చిందంటే.. ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు. ముఖ్యంగా పిల్లలున్న ఇంట్లో గరిజెలు(కజ్జి కాయలు) ఎక్కువగా చేస్తారు. కానీ.. మిగతా వాటితో పోలిస్తే.. దీనికి ప్రాసెస్​ కాస్త ఎక్కువ. అయితే.. టెక్​కూల్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ డంప్లింగ్​ మేకర్​తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు. 

ఈ మేకర్​ కింది భాగంలో పిండి పెట్టి పై నుంచి నొక్కితే పూరీ తయారవుతుంది. దాన్ని పై భాగంలో ఉండే గరిజె మేకర్​లో వేసి ఫిల్లింగ్​ చేయాలి. తర్వాత మూత మూసి ప్రెస్​ చేస్తే.. గరిజె రెడీ అవుతుంది. దీంతో మోమోస్​ కూడా చేసుకోవచ్చు. ఈ గరిజె మేకర్​ని క్వాలిటీ ప్లాస్టిక్​ మెటీరియల్‌తో తయారు చేశారు. చాలా మన్నికగా ఉంటుంది. పైగా దీన్ని క్లీన్​ చేయడం కూడా చాలా ఈజీ. కాకపోతే.. ఇందులో చిన్న సైజు గరిజెలు మాత్రమే చేసుకోవచ్చు. ధర: 199

ALSO READ | వడలను చాలామంది సరైన ఆకారంలో చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ వడ మేకర్​​