ఎండాకాలం ఇంట్లోనే చల్లని ఫ్రూట్ జ్యూస్ లు ఇలా తయారు చేసుకోండి..!

ఎండాకాలం ఇంట్లోనే చల్లని ఫ్రూట్ జ్యూస్ లు ఇలా తయారు చేసుకోండి..!

ఎండలకు ఇంట్లో, బయట తేడా లేకుండా వాతావరణం వేడిగా మారింది. దీంతో పిల్లలతో పాటు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ల ఒంట్లో వేడి పెరుగుతోంది. కాబట్టి రెగ్యులర్ డైట్తో పాటు వేడిని తగ్గించే పానీయాలు తాగడం మంచిది. అయితే, కొంచెం కొత్తగా తాజా పండ్లతో చేసే స్క్వాష్ 'లు తాగితే ఎనర్జీతో పాటు శరీరం చల్లబడుతుంది.

నేరేడు స్మూతీ

కావాల్సినవి : నేరేడు పండు ముక్కలు అర కప్పు ( విత్తనాలు లేకుండా), తాజా పెరుగు, అరకప్పు, పాలు అర కప్పు, చక్కెర రెండు టేబుల్ స్పూన్లు 
తయారీ : నేరేడు పండ్లను శుభ్రంగా కడిగి.. విత్తనాలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటితోపాటు పెరుగు, పాలు, చక్కెర కలిపి మెత్తగా మిక్సీ పడితే నేరేడుపండు స్మూతీ రెడీ. ఈ మిశ్రమంలో బస్ క్యూబ్స్ వేసుకుంటే కూల్ కూల్ గా తాగేయొచ్చు.

అవకాడో స్మూతీ

కావాల్సినవి: బాదంపప్పు అర కప్పు, అవకాడో పండు ఒకటి, పాలకూర కట్ట ఒకటి, నానబెట్టిన సబ్జా గింజలు ఒక కప్పు, వెన్న ఒక టీస్పూన్
తయారీ : ముందురోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం బాదంపప్పుల పొట్టు తీసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టాలి. ఈ మిశ్రమం ఒక గ్లాస్ అయ్యేలా చూ సుకోవాలి.

 ఆరెంజ్ స్క్వాష్

కావాల్సినవి : కమలాపండు రసం ఒక గ్లాసు, చక్కెర రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మ ఉప్పు ఒక టీ స్పూన్, ఆరెంజ్ కలర్ కొంచెం, ఆరెంజ్ ఎమల్షన్ ఒక టేబుల్ స్పూన్
తయారీ : చక్కెరలో అర గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద తీగపాకం వచ్చే వరకు ఉంచాలి. తర్వాత దీనిలో కమలాపండు రసం, నిమ్మ ఉప్పు, ఆరెంజ్ కలర్, ఆరెంజ్ ఎమల్షన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నీ ఫ్రిజ్లో ఉంచి బాగా కూల్ అయ్యే వరకు ఉంది... గ్లాసులో పోసుకొని తాగడమే. లేదంటే బస్ క్యూబ్స్ సర్వ్ చేసుకున్నా బాగుంటుంది.

పుదీనా స్క్వాష్

కావాల్సినవి : తాజా పుదీనా ఆకులు: రెండు కప్పులు, నిమ్మకాయలు: రెండు, చక్కెర: రెండున్నర కప్పులు, నీళ్లు; ఒక గ్లాసు, అల్లం తరుగు:
తయారీ : మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు, చక్కెర వేసి మీద పెట్టాలి. చక్కెర కరిగి కొంచెం ముదురు పాకంగా మారిన తర్వాత దించాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పుదీనా ఆకుల తరుగుతో పాటు మిగిలిన పదార్థాలు వేసి నాలుగైదు గంటలు పక్కనపె . ఇప్పుడు ఈ స్క్వాష్న గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిజ్లోపెట్టాలి. కావాల్సినప్పుడు ఒక గ్లాసు చల్లని నీళ్లలో రెండు, మూడు స్పూన్ల పుదీనా స్క్వాష్ కలుపుకుంటేచాలు.
 
పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూత్

కావాల్సినవి : స్ట్రాబెర్రీస్  ఒక కప్పు, పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు, యాలకులు మూడు, మిరియాల పొడి చిటికెడు, చక్కెర అర కప్పు, ఐస్ ముక్కలు ఒక కప్పు
తయారీ : పుచ్చకాయ, స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత వీటిలో విత్తనాలు తీసి మిక్సీ జార్లో వేసి ఒక కప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ సూత్రీని ఒక గన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. కొద్ది సేపటి తర్వాత మరోసారి ఈ స్మూతీని మిక్సీ జార్లో వేసి ఐస్ క్యూబ్స్, యాలకులు, చక్కెర వేసి గ్రైండ్ చేయాలి. సర్వింగ్ గ్లాస్లో పోసి.. చిటికెడు మిరియాల పొడి పైన వేస్తే చాలు.

ద్రాక్ష స్క్వాష్

కావాల్సినవి: గింజలు లేని నల్లద్రాక్ష కేజీ, చక్కెర ఒకటిన్నర కేజీ, నీళ్లు ఒకటిన్నర గ్లాసు, నిమ్మ ఉప్పు రెండు స్పూన్లు, సోడియం బెంజోయేట్ పావు టీస్పూన్, టోనిన్ ఎసెన్స్ అర టీ స్పూన్

తయారీ : చక్కెరలో అర లీటరు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు కరి గించాలి. తర్వాత ద్రాక్ష పండ్లను గుజ్జులా చేసి మరో పొయ్యి మీద పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దించాలి. బాగా చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కలపాలి. వేడి తగ్గాక ఇందులో చక్కెర పాకం కూడా వేసి నిమ్మ ఉప్పు, సోడియం బెంజోయేట్, టోనోవిన్ ఎసెన్స్ వేసి మరోసారి కలిపితే ద్రాక్ష స్క్వాష్ రెడీ,